కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వచ్చింది.. దాంతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏడు నెలలుగా థియేటర్స్ మూతపడే ఉన్నాయి. దాంతో మనకు అలవాటు లేని ఓటిటి కూడా పరిచయం అయిపోయింది. అప్పటి వరకు థియేటర్‌కు వెళ్లి చూసే ప్రేక్షకులకు ఇంటికే సినిమాలు తీసుకొచ్చేసారు నిర్మాతలు. అలా నేరుగా ఆన్లైన్లో వచ్చిన కొన్ని సినిమాలు ఆకట్టుకున్నాయి. నాని వి, అనుష్క నిశ్శబ్ధం లాంటి భారీ సినిమాలు మెప్పించలేకపోయినా.. చిన్న సినిమాలు మాత్రం సత్తా చూపించాయి.
డర్టీ హరి: సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారిన చేసిన సినిమా డర్టీ హరి. ఎరోటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నటించారు. డిసెంబర్ 18న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. ఫ్రైడే మూవీస్ యాప్‌లో ఈ సినిమాను విడుదల చేసారు.
గతం: ఎలాంటి అంచనాలు లేకుండా.. అసలు వస్తుందనే విషయం కూడా తెలియకుండా వచ్చిన సినిమా గతం. కొత్త దర్శకుడు కిరణ్ కొండమాడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6న విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ పేరు తెచ్చుకుంది. ఇండియన్ పనోరమాకు ఈ చిత్రం ఎంపికైంది.. అక్కడ ప్రదర్శనకు నోచుకుంది గతం.
మిడిల్ క్లాస్ మెలొడీస్: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. చూస్తుంటే అమెజాన్‌కు మంచి లాభాలు తీసుకొచ్చింది మిడిల్ క్లాస్ మెలొడీస్.
నర్తనశాల: చివరగా బాలయ్య నటించిన నర్తనశాల సినిమా కేవలం 16 నిమిషాల నిడివితోనే వచ్చింది. సినిమాలో ఏం లేకపోయినా కూడా కేవలం హైప్‌తోనే తొలి రోజే టికెట్స్ రూపంలో కోటికి పైగా వసూలు చేసింది. పెట్టిన ఖర్చుతో పోలిస్తే నర్తనశాల ఇప్పటికే బ్లాక్‌బస్టర్. కానీ చూసిన ప్రేక్షకులు మాత్రం నిజంగానే నిరుత్సాహపడిపోయారు.