సినిమా వాళ్ల పెళ్లి అంటే నీటి మీద రాతలు అంటుంటారు కొందరు. అది నిజం కాదని చాలా జంటలు ఇప్పటికే ప్రూవ్ చేసాయి. దశాబ్ధాల పాటు అన్యోన్యంగా కలిసున్న జంటలు ఉన్నాయి. కానీ కొందరు మాత్రం నిశ్చితార్థంతోనే తమ ప్రేమకు, పెళ్లికి బ్రేకప్ చెప్పేస్తున్నారు. నూరేళ్ళు కలిసుంటామంటూ ప్రమాణాలు చేసుకుని.. పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే విడిపోతున్నారు. మొన్న మెహ్రీన్ కౌర్ కూడా ఇలాగే తన నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది. హర్యానా ప్రముఖ రాజకీయ కుటుంబంలోని భవ్య బిష్ణోయ్‌తో ఈమె ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి ఉంటుందనగా.. ఇప్పుడు బ్రేకప్ చెప్పింది. ఇకపై ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండబోదని అఫీషియల్‌గా ప్రకటించింది మెహ్రీన్. ఈమె కంటే ముందు చాలా జంటలు ఇలాగే విడిపోయాయి.