దేశవ్యాప్తంగా ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ 2 గురించి చర్చ నడుస్తుంది. ఇండియా, శ్రీలంక నేపథ్యంలో రాజ్ డికే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ అద్భుతాలు చేస్తుంది. సినిమా రేంజ్లో ఇంకా చెప్పాలంటే సినిమా కంటే ఎక్కువగా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు రాజ్ డికే. ఈ ఇద్దరూ తెలుగు వాళ్లే కావడం గమనార్హం. తొలి సీజన్ అంతా ఇండియా పాకిస్థాన్ నేపథ్యంలో సాగితే.. రెండో సీజన్ మొత్తం శ్రీలంకన్ రెబల్స్ నేపథ్యంలో సాగింది.
అదిరిపోయే స్క్రీన్ ప్లేతో 400 నిమిషాలకు పైగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. సౌత్ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ కావడంతో మన నటీనటులే ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా సెకండ్ సీజన్‌కు సమంత బాగా హెల్ప్ అయింది. ఈమె బోల్డ్ అండ్ డేరింగ్ పాత్రలో నటించింది. మనోజ్ బాజ్పెయీ కీలక పాత్రలో నటించాడు. ప్రియమణి మరో ప్రధాన పాత్రలో కనిపించింది. అయితే ఇందులో నటించడానికి ఏయే నటుడు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..?
సినిమాల కంటే ఎక్కువగానే ఇక్కడ ఒక్కొక్కరికీ రెమ్యునరేషన్స్ అందాయి. ఈ సీజన్ కోసం దాదాపు ఏడాది పాటు అంతా తమ డేట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉంచారు. అందుకే రెమ్యునరేషన్స్ కూడా బాగానే తీసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ 2 కు మ్యాజికల్ రెస్పాన్స్ వస్తుంది.