Malayalam Actors In Tollywood: తెలుగు హీరోలు హిందీలో నటించడం, బాలీవుడ్ హీరోలు టాలీవుడ్లో యాక్ట్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. అటు తమిళ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే మలయాళ హీరోలు కూడా ఇప్పుడు తెలుగులో బిజీ అవుతున్నారు. అక్కడి హీరోలు ఇక్కడ విలన్స్ అవుతున్నారు.. కారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో నటించిన మలయాళ హీరోలెవరో చూద్దాం..
మోహన్‌లాల్ తెలుగులో తొలిసారి ప్రియదర్శన్ దర్శకత్వంలో బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా నటించిన ‘గాండీవం’ సినిమాలో ఓ పాటలో మెరిసారు. ఆ తర్వాత మనమంతా, జనతా గ్యారేజ్ వంటి డైరెక్ట్ తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలోనూ నటించబోతున్నట్లు తెలుస్తుంది.