2021 కూడా పూర్తిగా కరోనాకు బలైపోతుందేమో అనే భయాలు అందరిలోనూ కొన్ని రోజుల పాటు కనిపించాయి. ఏడాది మొదట్లో వరస విజయాలు అందుకుని.. ఆ తర్వాత 7 నెలలు మళ్లీ కరోనాకు బలైపోయింది ఇండస్ట్రీ. అయితే ఒక్కసారి థియేటర్స్ అన్నీ రీ ఓపెన్ అయిన తర్వాత విజయాలు మళ్లీ వచ్చాయి. ఏడాది చివర్లో అఖండ లాంటి సంచలనం కూడా తెలుగు ఇండస్ట్రీని పలకరించింది.
తెలంగాణ కలెక్షన్స్,రవితేజ క్రాక్ 15 డేస్ కలెక్షన్స్" width="1200" height="800" /> హిట్స్:
1. క్రాక్: అసలు సినిమాలు విడుదల చేస్తే థియేటర్స్ వైపు జనం వస్తారా రారా అనే అనుమానాలను పూర్తిగా తొలగించిన సినిమా క్రాక్. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి నిర్మాతలలో నమ్మకం పెంచేసింది. రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ దాదాపు 38 కోట్లు వసూలు చేసింది.
8. జాతి రత్నాలు: మార్చ్ 11న శివరాత్రి కానుకగా విడుదలైన జాతి రత్నాలు నిజంగానే జాతి రత్నాలు అనిపించారు. నవీన్ పొలిశెట్టి, ఫరియా జంటగా అనుదీప్ తెరకెక్కించిన ఈ చిత్రం 38 కోట్ల షేర్ వసూలు చేసింది. నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. బయ్యర్లకు 28 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చారు జాతి రత్నాలు.
10. లవ్ స్టోరి: 2021లో వచ్చిన మరో హిట్ లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన మొదటి పెద్ద చిత్రం. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. మొదటి రోజు 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది లవ్ స్టోరి. సెన్సిబుల్ పాయింట్ అద్భుతంగా చెప్పాడు కమ్ముల. దానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఏపీలో ప్రతికూల పరిస్థితుల కారణంగా 35 కోట్ల దగ్గరే ఆగిపోయింది ఈ చిత్రం.
11. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్: అఖిల్ కూడా 2021లోనే మొదటి విజయం అందుకున్నాడు. ఆరేళ్ల కెరీర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ రూపంలో ఫస్ట్ హిట్ ఈయన్ని పలకరించింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చింది. 24 కోట్లు వసూలు చేసి అఖిల్ కోరుకున్న విజయం అందించింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్.
12. అఖండ: థియేటర్స్ కు పూర్తిస్థాయిలో జనం వస్తారా రారా అనే అనుమానాలు పటాపంచలు చేసిన సినిమా అఖండ. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం చూపించిన సినిమా అఖండ. 18 రోజుల్లోనే 70 కోట్లకు చేరువగా ఈ సినిమా షేర్ వచ్చింది.