తమిళ టాప్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవడం గ్యారెంటీ. అత్యంత ప్రజాధారణ పొందిన ఈ హీరోల పారితోషకం ఆకాశాన్ని తాకుతోంది. తమిళంలో అత్యధికంగా పారితోషికం తీసుకునే హీరోలా జాబితాలో అజిత్ కుమార్, దళపతి విజయ్, రజనీకాంత్, ధనుష్, సూర్య తదితర హీరోలు ఉన్నారు. వారు తీసుకునే పారితోషకం వివరాలు ఇలా ఉన్నాయి.
suriya: దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతున్న సూర్య జై భీమ్ సినిమా ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించింది. సూర్య తమిళంలో మాత్రమే కాదు తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ పొందిన హీరో. సూర్య ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల పారితోషికం అందుకునే వారు.ఇప్పుడు ఆయన తన పారితోషియకాన్ని రూ. 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు పెంచేశారు.
Dhanush: ధనుష్ తన నటనకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. తాజాగా, బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడు అవార్డును సైతం అందుకున్నారు. తమిళ చిత్రసీమలోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ లలో కూడా గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ధనుష్ ఒక్క సినిమాకు రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు తీసుకుంటారు.