మా ఎన్నికలు జరుగుతున్నపుడు కచ్చితంగా వచ్చి ఓటేయాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. గతంతో పోలిస్తే ఈ సారి మా ఎలక్షన్స్‌లో ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది. ఎప్పుడూ కనీసం 550 ఓట్లు కూడా వచ్చేవి కావు. కానీ ఈ సారి మాత్రం 885 వాలిడ్ ఓట్లలో ఏకంగా 690 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 70 శాతం పోలింగ్ ఈ సారి నమోదైంది. అది కూడా మా సభ్యులకు ఓ పక్క ఆనందంగా.. మరోవైపు షాక్గానూ అనిపిస్తుంది. అయితే ఎప్పట్లాగే ఈ సారి కూడా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ముఖ్యంగా స్టార్ హీరోలలో చాలా మంది ఓటు వేయడానికి దూరంగానే ఉన్నారు. జెనిలియా లాంటి మాజీ హీరోయిన్లు ముంబై నుంచి ఓటేయడానికి వస్తే.. ఇక్కడే ఉన్న కొందరు ముద్దుగుమ్మలు మాత్రం మా ఎలక్షన్స్‌ను పట్టించుకోలేదు. మరి ఈ సారి ఓటేయని స్టార్స్ ఎవరో చూద్దాం..