తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ముందు వరసలో ఉంటాడు. అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి నిర్మాతలు అప్పుడప్పుడూ సినిమాలు నిర్మిస్తుంటారు. వాళ్ల నిర్మాణ సంస్థల నుంచి భారీ బడ్జెట్ సినిమాలు రావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. కానీ దిల్ రాజు మాత్రం అలా కాదు. అన్నీ కలిపి చేస్తుంటాడు ఈయన. ఓ వైపు చిన్న సినిమాలు.. మరోవైపు భారీ సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు. పైగా ఇప్పుడు ఈయన టాప్ ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన నిర్మాణ సంస్థలో చాలా సినిమాలు వస్తున్నాయి. డిసెంబర్ 17న దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఈయన గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.