YouTube Beauties: బుల్లితెరపై రప్ఫాడిస్తున్న యూ ట్యూబ్ బ్యూటీస్.. లక్షల్లో ఫాలోయర్స్..!

ఒకప్పుడు యూ ట్యూబ్ అంటే చిన్నచూపు చూసేవాళ్లు. అందులో షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్లను కూడా పట్టించుకునే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. కరోనా కాలం వచ్చిన తర్వాత యూ ట్యూబ్‌లో వచ్చే వెబ్ సిరీస్‌లు సూపర్ హిట్ అవుతున్నాయి. ఒక్కో సిరీస్ కోట్లలో వ్యూస్ అందుకుంటున్నాయి. దాంతో అందులో నటిస్తున్న వాళ్లకు కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే యూ ట్యూబ్ హీరోయిన్స్ ఇప్పుడు బుల్లితెరపై రప్ఫాడిస్తున్నారు.