మెగా కుటుంబం నుంచి కనీసం అరడజన్ సినిమాలైనా ఏడాదికి విడుదలవుతుంటాయి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు కాదు దాదాపు 10 మంది హీరోలున్నారు. అందులో సగం మంది హీరోలైనా కనీసం ఏడాదికి ఒక సినిమా విడుదల చేస్తుంటారు. కానీ 2022 మాత్రం మెగాభిమానులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే చిరంజీవి నుంచి ఇంకా ఎంట్రీ ఇవ్వని వైష్ణవ్ తేజ్ వరకు అంతా తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా 13 సినిమాలు మెగా కుటుంబం నుంచి ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటి.. ఎప్పుడొస్తున్నాయి..?