Tollywood Stars: సినిమా వాళ్లు కదా.. కోట్లలో డబ్బులుంటాయి.. యిష్టమొచ్చినట్లు తింటారు అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా చాలా డైట్స్ ఉంటాయి. కోట్లు ఉన్నా కూడా కడుపు నిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు యిష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా కొందరు కడుపు కట్టుకుని ఉంటారు. అయితే మరికొందరు మాత్రం బాగా తినేసి ఆ తర్వాత కొవ్వు కరిగించే పనిలో జిమ్‌లో కుస్తీలు పడుతుంటారు. మొత్తానికి ఎలా చేసినా కూడా మన స్టార్స్‌కు కూడా కొన్ని ఫేవరేట్ ఫుడ్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
రానా దగ్గుబాటి: కావాల్సింది మొత్తం తింటాడు కానీ అమ్మమ్మ చేతివంట అంటే రానాకు చాలా ఇష్టం. ఆమె చేసే సాంబార్ చాలా ఇష్టపడతాడు దగ్గుబాటి వారసుడు. ముఖ్యంగా ఒకప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మమ్మ తయారు చేసిన సాంబార్ వాసన ఎలా ఉండేదో.. వాటిని ఇడ్లీలు, దోసలతో ఎలా తినేవాడో ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడు ఈ కొత్త పెళ్లి కొడుకు. హైదరాబాదీ బిర్యానీ, హలీమ్ అంటే యిష్టమైనా కూడా డైట్ కోసం నోరు కట్టేసుకుంటాడు.