ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్ర రూ.410 కోట్లతో తెరకెక్కింది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం మూవీ టీమ్ భారీ పెట్టుబడులు పెట్టింది. అత్యంత ఖరీదైన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. కొవిడ్ తర్వాత విడుదలైన అత్యంత భారీ సినిమాల్లో ఒకటి కావడంతో ప్రజలు థియేటర్లకు వచ్చి ఆదరిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమాగా నిలుస్తోంది రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబో మూవీ RRR. 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుపాను సృష్టించింది. రూ.550 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీలో దాదాపు 2,800 విజువల్ ఎఫెక్ట్స్ (VFX) షాట్లు ఉన్నాయి. సినిమా కోసం 18 VFX స్టూడియోలు పని చేశాయి. ప్రపంచవ్యాప్తంగా RRR బాక్సాఫీస్ వద్ద రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసింది. : Twitter