భీమ్లా నాయక్ సినిమాతో రికార్డులు తిరగరాస్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆల్ టైమ్ రికార్డులు కొట్టకపోవడానికి కారణం ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటమే. లేదంటే చాలా చోట్ల ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసేవాడు పవర్ స్టార్. 110 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రానికి పర్ఫెక్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇప్పటికే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలోనే 53.07 కోట్ల షేర్ వసూలు చేసింది భీమ్లా నాయక్. మరి ఏపీ, తెలంగాణలో ఫస్ట్ వీకెండ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం..