2020లో ఎలాగోలా కాజల్ అగర్వాల్, నిహారిక లాంటి వాళ్లు పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంకా చాలా మంది హీరోయిన్లు పెళ్లి కాకుండా అలాగే ఉండిపోయారు. ఈ రోజుల్లో అమ్మాయికి పాతికేళ్లు వచ్చాయంటే పెళ్లెప్పుడు అని అడుగుతుంటారు. కానీ మన హీరోయిన్లు మాత్రం 30 ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి వైపు అడుగులు వేయడం లేదు. ఇప్పటికీ పెళ్లి గిల్లీ లేదంటూ కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్నారు. 30 దాటినా పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో చూద్దాం..