ఆ విషయంలో సల్మాన్,షారుఖ్‌ల కంటే అక్షయ్ కుమార్ తోపు..

గత కొన్నేళ్లుగా సెలబ్రిటీలు సినిమాలకే పరిమితం కాకుండా కమర్షియల్ యాడ్స్‌తో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలా యాడ్ ఫిల్మ్స్‌తో పాటు కమర్షియల్ యాడ్స్‌తో రెండు చేతులా సంపాదిస్తున్న నటుల్లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన చేతిలో రూ.100 కోట్లు విలువ చేసే కమర్షియల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత రూ.84 కోెట్లతో రణ్‌వీర్ సింగ్ రెండో స్థానంలో ఉంటే..మూడో ప్లేస్‌లో రణ్‌వీర్ సింగ్ సతీమణి దీపికా పదుకొణే రూ. 75 కోట్లతో మూడో స్థానంలో ఉంది.