కరోనా టైమ్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..

Nikhil Gowda marriage: కరోనా వైరస్ నేపథ్యంలో ఎలాంటి ఫంక్షన్లు లేవు. ఈ నేపథ్యంలో నిఖిల్ గౌడ.. కన్నడ హీరో నిఖిల్ గౌడ.. ఈయన గుర్తున్నాడా.. అప్పట్లో ఓ సారి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన కథతో జాగ్వార్ సినిమా చేశాడు. ఈయనకు చాలా పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. ఈయన తాత మాజీ ప్రధాని దేవెగౌడ.. తండ్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి. అంత బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టే స్టార్ హీరోలు కూడా కుళ్లుకునేలా ఎంట్రీ ఇచ్చాడు.తాజాగా ఈయన వివాహాం తన దగ్గర బంధువు రేవతితో వివాాహాం చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో అందరు వివాహాలను మిగతా ఫంక్షన్లను రద్దు చేసుకుంటే ఈయన మాత్రం తన కుటుంబ సభ్యలు కొద్ది మంది సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు.