Celebrities Marriages 2021: ఈ యేడాది 2021లో కరోనాతో ఎంతో మంది సినీ ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు. ఈ యేడాది మొదట్లో సింగర్ సునీత .. ప్రముఖ వ్యాపారవేత్త మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, దియా మీర్జా, విష్ణు విశాల్, ఆపై ప్రణీత పెళ్లి పీఠలు ఎక్కారు. అటు బాలీవుడ్ భామ యామీ గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక ‘గొడవ’ ఫేమ్ శ్రద్ధా ఆర్య కూడా మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసింది. ఇక టాలీవుడ్ యంగ్ హీరోగా కార్తికేయ మూడు ముళ్ల బంధంలో అడుగు పెట్టారు. తాజాగా యూరీ ఫేమ్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. మొత్తంగా 2021లో పెళ్లి పీఠలు ఎక్కిన సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారో మీరు ఓ లుక్కేయండి. (News18/Creative)
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, నటాషా దలాల్ పెళ్లి ఈ యేడాది జనవరి 24న అంగరంగ వైభవంగా ముంబైలోని అలీభాగ్ 5 స్టార్ హోటల్లో జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు కొందరు హీరోలు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు డేవిడ్ ధావన్‌కు సన్నిహితులైన కొందరు దర్శక నిర్మాతలు కూడా హాజరయ్యారు. అటు ప్రముఖ బాలీవుడ్ సింగర్ .. శిల్పారావు వివాహాం రితేష్ కృష్ణన్ తో జరిగింది. (News18/Creative)
జాతీయ ఉత్తమ నటుడు ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ వివాహాం పత్రలేఖతో నవంబర్ 20న జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క రంజన్ వివాహాం ఆదిత్య సీల్‌తో 22 నవంబర్ న జరిగింది. శ్రద్ధా ఆర్య తెలుగులో ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఆయన తనయుడు వైభవ్ హీరోగా పరిచయమైన ‘గొడవ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఈమె పలు టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై తమిళ సినిమాల్లో నటించింది. ఈమె వివాహాం నవంబర్ 17న దిల్లీకి చెందిన నేవి ఆఫీసర్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. (News18/Creative)
తాజాగా యూరీ ఫేమ్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. వీళ్లిద్దరు ఒక సినిమాలో కలిసి నటించక పోయినా.. ఎవరి సినిమాలతో వాళ్లు ఎంతో ఫేమస్ అయ్యారు. వీళ్లిద్దరు మ్యారేజ్ తర్వాత ఓ సినిమాలో కలిసి నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. వీరి పెళ్లి డిసెంబర్ 9న జరిగింది. (News18/Creative)