Flash Back 2022: 2022 ముగిసింది. అపుడు 2023లో ప్రవేశించాం. ఈ 12 నెలల కాలంలో ప్రేక్షకులను పలు డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డబ్బింగ్ చిత్రాలైన KGF 2, అవతార్ 2 అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకులను అలరించింది. మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కాంతార’ వంటి డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసాయి. మొత్తంగా గతేడాది కాలంలో టాలీవుడ్లో హిట్స్ అందుకున్న డబ్బింగ్ చిత్రాలేవో టాలీవుడ్ బాక్సాపీస్ రిపోర్ట్ చూద్దాం.. (File/Photo)
1.కెజియఫ్ ఛాప్టర్ 2 | కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసినమూవీ. ఈ చిత్రం మొదటి భాగం కేజీఎఫ్ చాఫ్టర్ 1తో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. రూ. 602.60 కోట్ల షేర్ (రూ. 1233 కోట్ల గ్రాస్) వసూళు చేసింది. తెలుగులో ఈ సినిమా రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 79 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ చిత్రం రూ. 84.25 కోట్ల షేర్ (రూ. 136.85 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తెలుగులో 5.25 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (kgf chapter 2)
2.కాలేజ్ డాన్ | శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలేజ్ డాన్’. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. సర్కారు వారి పాట సినిమాకు పోటీగా విడుదలైన ఈ సినిమా తెలుగులో సైలెంట్ కిల్లర్‌గా హిట్ స్టేటస్ అందుకుంది.తెలుగులో ఈ సినిమా రూ. 1.3 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలో దిగి ఓవరాల్‌గా రూ. 2.18 కోట్లు షేర్ (రూ. 4.35 కోట్ల గ్రాస్) రాబట్టి.. తెలుగులో రూ. 68 లక్షలకు పైగా లాభాలను తీసుకొచ్చి క్లీన్ హిట్‌గా నిలిచింది.
3.విక్రమ్ | కమల్ హాసన్ ముఖ్యపాత్రలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటించిన మూవీ విక్రమ్. తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఈ సినిమా తెలుగులో రూ. 17.80 కోట్ల షేర్ (రూ. 31.40 గ్రాస్) వసూళ్లు చేసింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 210 కోట్ల షేర్ ( రూ. 417.10 కోట్ల గ్రాస్ )వసూళ్లను సాధిచింది. దాదాపు రూ. 100 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
5. బ్రహ్మాస్త్ర | రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరోయిన్లుగా అమితాబ్, నాగార్జున, షారుఖ్ ఖాన్ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 5.50 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా తెలుగులో రూ. 13.30 కోట్ల (రూ. 30.60 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఈ సినిమా తెలుగులో రూ. 7.80 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 418.8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిచింది. (File/Photo)
6.‘కాంతారా’ | రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతారా’. ఈ సినిమా తెలుగులో రూ. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 2.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా తెలుగులో రూ. 29.65 కోట్ల షేర్ (రూ. 58.60 కోట్ల గ్రాస్)వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా తెలుగులో థియేట్రికల్‌గా ఈ సినిమా 27.35 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల షేర్ (రూ. 401. 05 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి త్రిపుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రూ. 180 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (File/Photo)
7. సర్ధార్ | కార్తి తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రిభినయం చేసిన మూవీ ‘సర్ధార్’. రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా తమిళంలో పాటు తెలుగులో మంచి హిట్ సాధించింది. తెలుగులో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. రూ. 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా తెలుగులో రూ. 7.95 కోట్లు (రూ. 16 కోట్లు గ్రాస్) వసూళ్లను సాధించింది. టోటల్‌గా ఈ సినిమా 2.45 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (File/Photo)
8. లవ్ టుడే’ తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సంచలన విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో విడుదల చేస్తే.. ఇక్కడ కూడా మంచి వసూళ్లనే సాధించింది. ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో రూ. 2.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 7.65 కోట్ల షేర్ (రూ. 14.80 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. నిర్మాతలకు థియేట్రికల్‌గా రూ. 4.65 కోట్ల లాభాలను తీసుకొచ్చి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
9.అవతార్ | జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా తెలుగులో రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ఓన్‌గా రిలీజ్ చేసారు. ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగులో రూ. 43 కోట్ల షేర్ (రూ. 86 కోట్ల గ్రాస్) వసూళ్లతో దుమ్ము లేపుతోంది. ఓవరాల్‌గా తెలుగులో రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశాలున్నాయి. (File/Photo)