Nirmala Sitharaman Watched kantara movie | ఒక్కోసారి కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాంటి అద్బుతమైన ఈ యేడాది ముందుగా చెప్పుకోవాల్సింది కార్తికేయ 2 సినిమా ఒకటి. ఆ తర్వాత కన్నడలో ‘కాంతారా’. చినుకు చినుకు గాలి వాన అయినట్టు.. కన్నడలో చిన్న సినిమాగా మొదలైన కాంతారా ప్రభంజనం ఇపుడు తెలుగుతో పాటు ఉత్తారాది ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తోంది. అక్కడ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ సినిమాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ వీక్షించి అద్భుతం అంటూ కితాబు ఇచ్చారు. (Twitter/Photo)
తెలుగులో కాంతారా దెబ్బకు చిరు గాడ్ ఫాదర్ సహా దీపావళికి విడుదలైన సినిమాల కలెక్షన్స్ పై పెద్ద దెబ్బ పడింది. మన ప్రేక్షకులకు తెలియని హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ ఇపుడు ప్రతి ఇండస్ట్రీలో మారు మోగుతూనే ఉంది. తాజాగా తెలుగులో నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకుంది. కాంతార ది లెజెండ్ అంటూ కర్నాటకలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. (Twitter/Photo)
ఈ చిత్రం తెలుగు,తమిళంలో అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో అక్టోబర్ 14న విడుదలైంది. మలయాళంలో మాత్రం అక్టోబర్ 20న గ్రాండ్గా రిలీజైంది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తుంది. థియేటర్స్ దగ్గర జనాలు సిగమూగిపోతున్నారు. ఈ సినిమ ా చివరి అర గంట ప్రేక్షకులను గగుర్పాటుకు గురిచేస్తోంది. తాజాగా ఈ చిత్రం రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రేంజ్ వసూళ్లను సాధించడం మాములు విషయం కాదంటున్నారు. (Twitter/Photo)
ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకుపైగా వసూలు చేసింది. Photo : Twitter
మొదటి రెండు రోజుల్లోనే 11 కోట్లకి పైగా ఒక్క తెలుగు భాషలోనే వసూలు చెయ్యగా ఇప్పుడు మూడో రోజు కూడా 5 కోట్ల గ్రాస్ ని అందుకొని మూడు రోజుల్లో 16.5 కోట్లు అందుకొని భారీ హిట్ అయ్యింది. కాంతార మొదటి రోజు రూ. 2.10 కోట్లు.. 2వ రోజు రూ. 2.80 కోట్లు.. 3వ రోజు రూ. 1.90 కోట్ల షేర్.. 4వ రోజు 1.45 కోట్ల షేర్.. 5వ రోజు 1.36కోట్లు వసూళు చేసింది. 12వ రోజు ఈ సినిమా రూ. 60 లక్షలు.. 13వ రోజు.. రూ. 49 లక్షలు..14వ రోజు .. రూ. 43 లక్షల షేర్ వసూళు సాధించింది. తాజాగా 19వ రోజు కూడా రూ. 62 లక్షల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. (Twitter/Photo)
ఇక ఈ చిత్రానికి అయితే హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించగా తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రిలీజ్ చేశారు. ఈ సినిమా 19 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 11.03 కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 2.72 కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 2.96 కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 1.76కోట్లు.. వెస్ట్ గోదావరి - రూ. 1.10 కోట్లు గుంటూరు - రూ. 1.46కోట్లు కృష్ణా - రూ. 1.43 కోట్లు.. నెల్లూరు రూ. 0.84 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి ఈ చిత్రం 19 రోజులకు గాను రూ. 23.30 కోట్లు షేర్ (రూ. 42.20కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది.
తెలుగులో కాంతార రూ. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 16.51 కోట్ల రాబట్టింది. మొత్తంగా రూ. 21 కోట్ల లాభాలను ఆర్జించింది. అంటే పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్గా ఈ చిత్రం సంచనాలు మాత్రం ఆగడం లేదు. ఇక హిందీలో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 45 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి అక్కడ కూడా సత్తా చాటుతోంది. (Twitter/Photo)
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా 1847 బ్యాక్డ్రాప్ మొదలవుతోంది. అపుడు మన దేశంలో ఇంకా వివిధ రాజ్యాలు పాలన చేస్తూ ఉంటాయి. అందులో ఒక రాజ్యానికి చెందిన రాజుకు ఎన్ని దాన ధర్మాలు చేసిన పూజలు చేసిన ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంది. ఈ క్రమంలో రాజ పురోహితులు చెప్పిన ప్రకారం ప్రశాంతత కోసం దేశాటనకు బయలుదేరుతారు.
కొన్ని తరాల తర్వాత ఆటవిక ప్రాంతానికి ఇచ్చిన భూమిపై రాజు గారి వారసుల కన్ను పడుతోంది. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ఆ రాజు వారసులు ఆ అటవి ప్రాంతానికి చెందిన భూమికి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో దైవశక్తి వారికి అడ్డు తగులుతుంది ? ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఈ ‘కాంతారా’ మూవీ స్టోరీ. చిన్నప్పటి నుండి రిషబ్ శెట్టి చూసిన సంఘటనలు జరిగిన కొన్ని సంఘటనల తో ఈ కథ రాసుకున్నాడు. .
10 ఎకరాలు స్థలం లో కథకి అనుకూలంగా విలేజ్ మిగిలిన సెట్స్ వేసి 90% Natural ఫారెస్ట్ locations lo shoot చేసినట్టు చెప్పుకొచ్చారు.RFO కిషోర్ air fire చేసి గాయపడిన సీన్ నిజంగా మా ఫోర్ father's టైం లో జరిగినట్టు వెల్లడించారు. ఈ సినిమాలో చూపించనట్టు ఫారెస్ట్ వాళ్లు కొన్నేళ్ల క్రితం లాండ్ గ్రాబ్బింగ్ ఇష్యూ మీద ఫారెస్ట్ సర్వే మా ఉర్లో జరిగిందట. దాన్ని ఈ సినిమాలో యథాతదంగా రాసుకొని ఈ సినిమా కథను తెరకెక్కించినట్టు రిషబ్ పేర్కొన్నారు. (Twitter/Photo)