Film Industry Corona: ఫిల్మ్ ఇండస్ట్రీపై కరోనా కాటు.. తాజాగా కోవిడ్ బారిన పడ్డ ’యూరీ’ హీరో విక్కీ కౌశల్..

Vicky Kaushal Bhumi Pednekar Covid Positive | మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త రెండు వారాలుగా  దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, గోవిందా సహా పలువురు సెలబ్రిటీలో కరోనా బారిన పడ్డారు. తాజాగా యూరీ హీరో విక్కీ కౌశల్‌‌తో పాటు భూమి పెడ్నేకర్ తాము కోవిడ్ బారిన పడినట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.