Fathers Day Special | ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులే కాదు. వారసురాళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఎక్కువగా బాలీవుడ్ నుంచి ఎక్కువ మంది హీరోల తనయులు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి నిహారిక రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. వీరితో పలు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల కూతుళ్లు హీరోయిన్గా తమ లక్ పరీక్షించుకున్నారు.
నిహారిక | మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా పరిచయమైన నిహారిక. 2020 చివర్లో పెళ్లి చేసుకుంది. మెగా (కొణిదెల) ప్యామిలీ నుంచి చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక నాగబాబు కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ఐశ్వర్య రాజేష్ కూడా ఒకప్పటి టాలీవుడ్ నటుడు హీరో రాజేష్ కూతురు, పేరుకు తమిళ హీరోయిన్ అయినా కూడా ఈమె అచ్చ తెలుగమ్మాయి. ఈమె తండ్రి రాజేష్ తెలుగులో ఒకప్పుడు మంచి నటుడు. జంధ్యాల తెరకెక్కించిన సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఈయన దాదాపు 54 సినిమాలు చేసాడు. దాంతో పాటు మంచి ఇమేజ్.. ఫ్యూచర్ స్టార్ అవుతాడనుకునే తరుణంలో కేవలం 38 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయాడు. (Twitter/Photo)
అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ..ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పెద్ద కూతురు. ఈమె కూడా కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా.ట్వింకిల్ ఖన్నా చెల్లెలు రింకీ ఖన్నా కూడా కొన్ని సినిమాల్లో కథానాయికగా లక్ పరీక్షించుకుంది. ఈమె రాజేష్ ఖన్నా చిన్న కూతురు.(Image: Viral Bhayani)