డిసెంబర్ 4న జైపూర్ సమీపంలోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్లో హన్సిక మోత్వాని, సోహైల్ ఖతురియా ఈ జంట పెళ్లి సింధీ సంప్రదాయ వేడుకలో జరిగింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఒక్కటయ్యారు. రెడ్ కలర్ వర్క్ లెహెంగాలో హన్సికా,సిల్వర్, వైట్ కలర్ షెర్వానీలో సోహైల్ కలర్ఫుల్గా కనిపించారు.
హన్సిక పెళ్లికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.అందులో భాగంగానే సూఫీ నైట్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హన్సిక ధరించిన ట్రెడిషనల్ గాగ్రా... ఆమె పెట్టుకున్న పాపిట బిళ్ల... మెడలో నెక్లస అన్నీ కూడా నిజామీ జూమర్ స్టైల్లోనే ఉన్నాయి. దీంతో ఈ లుక్లో హన్సికను చూసిన వారంతా... అచ్చం ముస్లీం పెళ్లికూతురులా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.
జైపూర్లోని 400ఏళ్ల క్రితం నిర్మించిన రాజకోటలో ముంబై లేడీ హన్సికా మోత్వానీ మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ముందుగా గులాబీలతో అలంకరించిన పల్లకిపై పెళ్లికూతురు అలంకారంలో వివాహ వేదికకు వచ్చిన హన్సిక మెడలో పూల దండ వేసి నుదుటన సింధూరం పెట్టి తన పెళ్లి చేసుకున్నాడు. సోహైల్ సింధూరం పెడుతున్న వేళ హన్సిక ఎమోషనల్ అయ్యింది. hansika motwani(Photo:Instagram)