Vijay Devarakonda - Vishwak Sen: విజయ్ దేవరకొండతో గొడవకు కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్..
Vijay Devarakonda - Vishwak Sen: విజయ్ దేవరకొండతో గొడవకు కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్..
Vijay Devarakonda - Vishwak Sen: తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). మరోవైపు అండ లేకుండానే ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న మరో కుర్ర హీరో విశ్వక్ సేన్(Vishwak Sen). ఈ ఇద్దరి మధ్య అప్పట్లో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది.
1/ 9
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో మార్కెట్ పెంచుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు.
2/ 9
మరోవైపు అండ లేకుండానే ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న మరో కుర్ర హీరో విశ్వక్ సేన్. వెళ్లిపోమాకే లాంటి చిన్న సినిమాతో పరిచయం అయిన ఈ కుర్రాడు.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
3/ 9
హిట్ సినిమాతో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. అయితే ఫలక్నుమా దాస్ టైమ్లో విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ మధ్య ఏదో గొడవ జరిగిందని.. కావాలనే విజయ్ను టార్గెట్ చేసాడని విశ్వక్పై సోషల్ మీడియాలో దేవరకొండ ఫ్యాన్స్ మండిపడ్డారు.
4/ 9
ఫలక్నుమా దాస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఇప్పటికే ఒకడ్ని లేపినం.. మళ్లీ ఈన్నెక్కడ లేపాల్రా నాయనా అనుకుంటున్నారేమో.. నన్నెవడూ లేపాల్సిన అవసరం లేదు.. నన్ను నేనే లేపుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు విశ్వక్ సేన్.
5/ 9
అవి విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసారంటూ అప్పట్లో ప్రచారం జోరుగానే జరిగింది. ఇద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రచ్చ కూడా బాగానే జరిగింది. అయితే ఈ విషయంపై అటు విజయ్ కానీ.. ఇటు విశ్వక్ సేన్ కానీ ఎప్పుడూ క్లారిటీ ఇచ్చింది లేదు.
6/ 9
అయితే తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చిన విశ్వక్ సేన్.. విజయ్ దేవరకొండతో గొడవ విషయంపై మాట్లాడారు. అసలు ఆ రోజు తాను విజయ్ను ఏమనలేదని.. కావలనే కొందరు తమ మధ్య పుల్ల పెట్టారని చెప్పుకొచ్చారు. తమ ఇద్దరి మధ్య స్నేహం, శత్రుత్వం రెండూ లేవని క్లారిటీ ఇచ్చారు.
7/ 9
ఫలక్నుమా దాస్ టైమ్లో ఓ నిర్మాత వీన్ని తొక్కండ్రా అన్నాడని.. దాంతో అప్పటి వరకు పడిన కష్టమంతా వృథా అయిపోతుందేమో అని భయపడ్డానని.. ఆ కంగారులోనే ఆ రోజు స్టేజీపై అలా మాట్లాడాను కానీ ఎవర్నీ ఉద్దేశించి కాదని చెప్పుకొచ్చారు విశ్వక్ సేన్.
8/ 9
దాన్ని కొన్ని మీడియా సంస్థలు మార్చి రాసాయని.. మసాలా యాడ్ చేసి దాన్ని మరింత హైలైట్ చేసారని చెప్పారు. అసలు ఆ రోజు తాను విజయ్ దేవరకొండను ఒక్క మాట కూడా అనలేదని తెలిపారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నానని.. తననెవ్వడూ లేపాల్సిన అవసరం లేదని.. నన్ను నేను లేపుకుంటానంటూ మళ్లీ కామెంట్ చేసారు విశ్వక్.
9/ 9
ఎవరూ అవకాశాలు ఇవ్వకపోయినా కూడా తానే డైరెక్షన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు ఈయన. మొత్తానికి ఇష్యూ జరిగిన రెండేళ్లకు విజయ్ దేవరకొండ విషయంపై నోరు విప్పారు ఈయన.