విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 27న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించాడు. ‘డేట్ గుర్తుపెట్టుకోండి. ఎంటర్ టైన్మెంట్ సిద్ధం.’ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
2/ 5
ఆగస్టు 27న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించాడు. ‘డేట్ గుర్తుపెట్టుకోండి. ఎంటర్ టైన్మెంట్ సిద్ధం.’ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
3/ 5
శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎఫ్ 2లో ఉన్న ఫన్ కంటే కూడా ఇందులో ట్రిపుల్ ఫన్ ఉంటుందంటూ నిర్మాణ సంస్థ కూడా ట్వీట్ చేసింది.
4/ 5
వీరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు మంచి ఫన్తో సాగిన సినిమా చూసి అభిమానులు కనకవర్షం కురిపించారు.
5/ 5
దీంతో ఎఫ్ 3 సినిమాలో అంతకు మించిన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉండేలా సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. డిసెంబర్లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సినిమా షూటింగ్ చాలా వేగంగా కొనసాగుతోంది. దీంతోపాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు.