సమ్మర్ సీజన్ కు సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చిన భారీ చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 2 మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్గా ఎఫ్3ని తెరకెక్కించాచు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్ వరుణ్ తేజ్ తమన్నా, మెహరీన్ వంటి స్టార్ కాస్ట్ తో పాటు భారీ తారాగణం ఉండటం సినిమాకు మరో ఎసెట్ అయ్యింది. నిర్మాతగా దిల్ రాజు గుడ్ విల్ సినిమా విజయం మీద నమ్మకం పెంచింది.
ఈజీ మనీ కోసం నిరంతరం కలలు కనే వ్యక్తులు వెంకీ (వెంకటేష్), వరుణ్ (వరుణ్ తేజ్). రకరకాల బిజినెస్ ఐడియాలతో ఉన్న డబ్బు పోగొట్టుకుని, డబ్బు ఎలా సంపాదించాలా అని నానా కష్టాలు పడుతుంటారు. ఆ క్రమంలో ఓ డబ్బు బిజినెస్ మ్యాన్ (మురళీ శర్మ) తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతుంటాడు.ఇది తెలిసిన వెంకీ వరుణ్...ఓ ప్లాన్ వేస్తారు.
మే 27న విడుదలైన F3 మూవీ ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ అందించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ టాక్ సంపాదించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీని ముఖ్యంగా ఫ్యామిలీస్ చూసేందుకు థియేటర్లకు తరలివెళ్లారు. అలీ, రఘుబాబు కామెడీ కూడా ప్రేక్షకులకు వీనుల విందు అందించింది.