బుల్లితెర ప్రేక్షకులందరికీ కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది జబర్దస్త్ కామెడీ షో. 9 ఏళ్లుగా నిర్విరామంగా నవ్విస్తూనే ఉన్నారు వాళ్లు. పైగా ఈ కార్యక్రమం రేటింగ్స్ పరంగా కూడా బాగానే ఉంటుంది. ఈ మధ్య కాస్త తగ్గినట్లు అనిపించినా.. తనదైన నవ్వులతో ముందుకు వెళ్తూనే ఉంది. 20 ఎపిసోడ్స్లతో ముగిద్దాం అని సాదాసీదాగా మొదలైన కామెడీ షో ఈ రోజు ప్రభంజనంలా మారిపోయింది. సౌత్ ఇండియన్ బుల్లితెరపై బెస్ట్ కామెడీ షోలలో ఒకటిగా నిలిచిపోయింది జబర్దస్త్.
దీని నుంచి ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు.. పేరు తెచ్చుకున్నారు.. స్టార్స్ అయ్యారు. సినిమాలకు వచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. కోట్లాది మంది ఆడియన్స్ను కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తుంది ఈ షో. అప్పుడప్పుడూ ఇందులో కూడా విచిత్రమైన స్కిట్స్ చేస్తుంటారు.
నవ్వించడానికి 100 మార్గాలు అన్నట్లు.. అన్ని విధాలుగానూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు కమెడియన్లు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ప్రోమో విడుదలైంది. అందులో ఓ స్కిట్ చూసి అంతా షాక్ అయిపోయారు. సుడిగాలి సుధీర్ చేసిన ఈ స్కిట్ ప్రోమోతోనే కడుపులు చెక్కలు చేస్తుంది. ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్లతో తెర మీదికి వస్తుంటారు జబర్దస్త్ టీమ్ లీడర్లు. ఇప్పుడు కూడా ఇదే చేసారు.
వచ్చేవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ సారి ఎక్స్ ట్రా జబర్దస్త్లో జడ్జిగా మనో స్థానంలో నిన్నటి తరం హీరోయిన్ ఆమని కనిపించింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే సుడిగాలి సుధీర్ బాగా నవ్వించేసాడు. స్కిట్లో భాగంగా సుధీర్ పెళ్లి చేసుకోవాలంటే ఏడు తరాల వాళ్ళని చూడాలి అంటాడు అతని మామ.
అక్కడే ఉన్న యంకర్ రష్మీ గౌతమ్ వెంటనే యాంకర్ సీట్లో నుంచి లేచి నిజంగానే నగ్నంగా ఉన్నారా లేదా అని తొంగి తొంగి చూస్తుంది. దీంతో అందరూ తెగ నవ్వుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఆది మానవుల నుంచి నేటి వరకు తన తరాలు ఉన్నాయంటూ స్కిట్లో చెప్పడానికి సుడిగాలి సుధీర్ ఈ స్కిట్ చేసాడు. ప్రోమోనే ఇంత వైరల్ అయితే.. రేపు ఫుల్ స్కిట్ ఎలా ఉండబోతుందో చూడాలి.