ఈ క్రమంలోనే చాలా జబర్దస్త్ జోడీలు తెగ పాపులర్ అయ్యాయి. అయితే ఈ జోడీలన్నింటిలో సుడిగాలి సుధీర్- రష్మీ (Sudigali Sudheer- Rashmi) జోడీకి తెగ పాపులారిటీ దక్కింది. ఆ తర్వాత అదే రేంజ్లో కిక్కిచ్చిన జోడీ అంటే వర్ష- ఇమ్మాన్యుయేల్ (Varsha- Emmanuel) అనే చెప్పుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ జోడీగా ఈ పెయిర్ చేసే అల్లరి మాములుగా ఉండదు.
ఇకపోతే తాజాగా విడుదల చేసిన జబర్దస్త్ ప్రోమో వీడియోలో వర్ష- ఇమ్మాన్యుయేల్ మధ్య నడిచిన ఓ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. అందరిముందే నేరుగా వర్ష వచ్చేయ్ అలా తుప్పల్లోకెళదాం అనేశాడు ఇమ్మూ. ఇమ్మూ డబుల్ మీనింగ్‌తో అన్నాడా లేక టీఆర్ఫీ కోసం ఇలా ప్లాన్ చేశారా అనేది తెలియదు కానీ ఈ డైలాగ్ హాట్ టాపిక్ అయింది.
అబ్బాయిలా ఉంటావ్.. లేడీ గెటప్ అంటూ వర్షను అందరూ ఎగతాళి చేస్తుంటారు. ఇలా చేస్తుంటే గతంలో ఓ సారి వేదికపైనే సీరియస్ అయింది వర్ష. స్కిట్ మధ్యలోనే ఆమె వెళ్లిపోతున్నట్టుగా చూపించారు. మళ్ళీ ఇప్పుడేమో ఆమెతోనే నేను మగాడిని అని చెప్పించారు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు టీఆర్ఫీ కోసం కొత్త కొత్త ఆలోచనలు అన్నట్లుంది ఈ వ్యవహారం.