టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు... అటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే... పవన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల్లో కూడా పవన్‌కు పిచ్చిగా ఆరాధించే అభిమానులు ఉన్నారు. అటు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను రాజకీయ నాయకుడుగా అభిమానించేవారు కొందరు ఉంటే.. నటుడిగా, హీరోగా అభిమానించే వారు లక్షల్లోనే ఉన్నారు. అయితే పవన్‌ను ఓ నటుడిగా అభిమానించే వారు... పలు పార్టీల్లో ఉండేఉంటారు. పవన్ ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా... పలు రాజకీయ పార్టీలతో పాటు.. నేతలపై కూడా విమర్శలు చేశారు. అయితే... పవన్‌కు ప్రముఖ వైసీపీ నేత, మాజీ మంత్రి ఒకప్పుడు వీరాభిమానే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో మరే హీరోకి లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీతో పలువురు దర్శక నిర్మాతలు సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సినిమాకు 65 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్న విషయం తెలిసిందే.