Jabardasth: బుల్లితెరలో ప్రసారమౌతున్న కామెడీ షో జబర్దస్త్. ఎన్నో ఏళ్ళ నుండి ఈ కామెడీ షో ప్రసారం అవుతూ ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది. అంతేకాకుండా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఎక్కువ ఎంటర్టైన్మెంట్, కామెడీ కోరుకునే ప్రేక్షకులకు జబర్దస్త్ తో పాటు మరికొన్ని షోలు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈటీవీ రేటింగ్ లో చూసినట్లయితే మిగతా షోల కంటే జబర్దస్త్ టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ లాక్ డౌన్ నేపథ్యంలో తక్కువ రేటింగును అందుకుంది. ఈటీవీ లోనే కాకుండా స్టార్ మా లో ప్రసారం అవుతున్న సుమ, ఓంకార్ వంటి షోలు కూడా మంచి రేటింగ్ ను అందుకున్నాయి.