లేటెస్ట్ గా ‘పిట్ల కథలు’ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈషారెబ్బ (Eesha Rebba) ప్రస్తుతం తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో మాత్రం నటిస్తోంది. అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది. నిజానికి ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీ తర్వాత ‘అమీ తుమీ’ ‘అ’, ‘అరవింద సమేత’ చిత్రాలు మాత్రమే ఈషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. (Photo Credit : Instagram)
ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు 9ఏళ్ళు కావస్తుంది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు.సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా రాణిస్తున్న వారిలో ఈషా రెబ్బా ఒకరు. (Photo Credit : Instagram)