దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు. దుల్కర్.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్ పాత్రలో నటనతో మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దుల్కర్ తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు దుల్కర్. Photo : Twitter
అది అలా ఉంటే దుల్కర్ తెలుగులో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రానికి సీతా రామం అనే టైటిల్ ను ప్రకటించారు. అంతేకాదు టైటిల్‌ను ప్రకటించడానికి చిత్ర బృందం వీడియో గ్లింప్స్ ను విడుదల చేసింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా నిర్మించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది. Photo : Twitter
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదిని ఖరారు చేసింది టీమ్. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ లెఫ్ట్‌నెంట్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... 1964 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనున్నది. Photo : Twitter
ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. అందులో భాగంగా ఫస్ట్ లుక్ లో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ పెట్టింది చిత్రబృందం. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. Photo : Twitter
ఇక దుల్కర్ లేటెస్ట్ సినిమా కురుప్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కువ కాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన నేరగాడు సుకుమార కురుప్ జీవితగాధ ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ చిత్రానికి శ్రీ నాథ్ రాజేంద్రన్ దర్శకుడు. ఈ క్రైమ్ డ్రామాలో ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీవేన్, షైన్ టామ్ చాకో, శోభిత ధూళిపాళ్ల, అనుపమ పరమేశ్వరన్, శివజిత్ పద్మనాభన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన ‘సెల్యూట్’ అనే సినిమా చేసారు. Photo : Twitter
ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికీ మన దేశంలో కరోనా ఓమైక్రాన్ రూపంలో విరుచుకుపడటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇందులో దుల్కర్ సల్మాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ప్యాన్ ఇండియా మూవీస్‌తో పాటు అన్ని సినిమాలు థియేటర్స్‌లో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సెల్యూట్’ చిత్రాన్ని చిత్ర నిర్మాతలు థియేటర్స్‌లో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. Photo : Twitter