దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)లు నటించిన అద్భుత ప్రేమకావ్యం సీతా రామం (Sita Ramam). హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా మళయాళంలో మంచి హిట్‌గా నిలిచింది. ఇక ఈ ప్రేమకావ్యం తాజాగా హిందీలో కూడా విడుదలైంది.. (Twitter/Photo)
వైజయంతీ మూవీస్ సమర్ఫణలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ టాక్‌తో బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ చిత్రం 40 కోట్ల షేర్‌ను 80 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని కేక పెట్టించింది. (Twitter/Photo)
అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 9నుంచి స్ట్రీమింగ్కు రానుంది. దీనికి సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. చూడాలి మరి అక్కడ ఎలా అలరించనుందో.. ఇక ఈ సినిమా హిందీలో కూడా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. (Twitter/Photo)
ఈ సినిమాలో నటించిన దుల్కర్, మృణాల్, రష్మిక ఈ ముగ్గురికి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది.. కనుక మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.. ఈ సినిమాను హిందీలో పెన్ మూవీస్ విడుదల చేసింది. ఈ సంస్థ గతంలో ఆర్ ఆర్ ఆర్ అక్కడ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా తెలుగు వర్షన్ యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ వసూళ్లు చేసింది. (Twitter/Photo)
ఇక ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కర లేదు. దుల్కర్.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్ పాత్రలో నటనతో మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈయన హీరోగా విడుదలైన ఈ సీతారామం సినిమా విమర్శకులు ప్రశంసలు దక్కించుకుంటోంది. (Sita Ramam Ticket Rates Twitter
హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకపోవడంతో పాటు కుటుం బ సమేతంగా చూసేలా ఉండటంతో ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాసిక్ లవ్ స్టొరీ సీతా రామం బ్రేక్ ఈవెన్‌ని పూర్తీ చేసుకుని అదరగొట్టింది.(Twitter/Photo)