RajaShekar - Sreeleela: టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించిన అప్పటి అగ్రహీరోలైన చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలకు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఇచ్చారు. ఈయనకు టాలీవుడ్లో ఇపుడిపుడే హీరోయిన్గా పరిచయమైన శ్రీలీలకు చిన్న సంబంధం ఉంది. రాజశేఖర్ కేవలం నటుడే కాకుండా... డాక్టర్ కూడా. ఇక శ్రీలీల కూడా ప్రస్తుతం డాక్టర్ చదువుతోంది.ఈమె తల్లి కూడా ప్రముఖ డాక్టర్. అదే బాటలో ఈ యేడాది ఈమె డాక్టర్‌గా పట్టా పుచ్చుకోబోతుంది. వీళ్ల బాటలో డాక్టర్ తో పాటు యాక్టర్ అయిన నటీనటుల విషయానికొస్తే.. (Twitter/Photo)
శ్రీలీల | శ్రీలీల, వరుసగా పెళ్లిసందడి, ధమాకా సినిమాల సక్సెస్‌తో టాలీవుడ్లో దూకుడు మీదుంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే MBBS చదువుతోంది. ఈ యేడాది ఈమె డాక్టర్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల ఫోటోలను పీ.ఏ.అర్జున్ ఈమెను ఆయన తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘కిస్’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అలా హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం తెలుగులో యువ హృదయాలను కొల్లగొడుతోంది. (Photo : Instagram)