Doctors Cum Actors in Tollywood: అల్లు రామలింగయ్య, రాజశేఖర్, సాయి పల్లవి సహా టాలీవుడ్ డాక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరెరున్నారో మీరే చూడండి..
Doctors Cum Actors in Tollywood: అల్లు రామలింగయ్య, రాజశేఖర్, సాయి పల్లవి సహా టాలీవుడ్ డాక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరెరున్నారో మీరే చూడండి..
Doctors Cum Tollywood | డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం అంటుంటారు కొందరు. కానీ డాక్టర్ అయి కూడా యాక్టర్ అయ్యారు మరికొందరు. టాలీవుడ్లో మనకు బాగా తెలిసిన కొందరు నటులు నిజ జీవితంలో స్టెతస్కోప్ పట్టుకుని వైద్యం చేసారు.. చేస్తున్నారు. వాళ్లెవరో ఒక్కసారి చూద్దాం..
Doctors Cum Tollywood | డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం అంటుంటారు కొందరు. కానీ డాక్టర్ అయి కూడా యాక్టర్ అయ్యారు మరికొందరు. టాలీవుడ్లో మనకు బాగా తెలిసిన కొందరు నటులు నిజ జీవితంలో స్టెతస్కోప్ పట్టుకుని వైద్యం చేసారు.. చేస్తున్నారు. వాళ్లెవరో ఒక్కసారి చూద్దాం..
2/ 16
అల్లు రామలింగయ్య: ఆయుర్వేదంలో ఈయనకు మంచి పట్టుంది. హోమియో వైద్యుడిగా అల్లు రామలింగయ్య సుప్రసిద్ధుడు. ఈ రోజు అల్లు రామలింగయ్య 100వ జయంతి. (Twitter/Photo)
3/ 16
రాజశేఖర్: ఈయనకు టాలీవుడ్లోనే వైద్యుడిగా మంచి పేరుంది. చాలా మందిని ట్రీట్ చేసాడు కూడా. ‘గరుడ వేగ’ సినిమాతో హీరోగా మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యారు. (Twitter/Photo)
4/ 16
సాయి పల్లవి: ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుండె సంబంధిత వైద్య నిపుణురాలిగా పని చేస్తుంది సాయి పల్లవి. రీసెంట్గా ‘లవ్ స్టోరీ’ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. (Twitter/Photo)
5/ 16
రూప కొడువయూర్: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూసిన వాళ్లకు రూప కొడువయూర్ గురించి పరిచయం అక్కర్లేదు. సెకండాఫ్‌లో వచ్చే ఈ భామ స్వతాహాగా డాక్టర్ మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. (Twitter/Photo)
6/ 16
బాలకృష్ణ హీరోగా నటించిన ‘జై సింహా’లో ఒక కథానాయికగా నటించిన నటాషా దోషి కూడా హీరోయిన్ కాకముందు డాక్టర్. ప్రస్తుతం ఈమె వేరే భాషల్లో చిత్రాలు చేస్తోంది. (Twitter/Photo)
7/ 16
ప్రభాకర్ రెడ్డి: నటుడిగా 470 సినిమాలకు పైగా నటించిన ప్రభాకర్ రెడ్డి.. వృత్తిరీత్యా వైద్యుడు కూడా. (File/Photo)
8/ 16
భరత్ రెడ్డి: అపోలో హాస్పిటల్లో భరత్ రెడ్డికి కార్డియాలజీ స్పెషలిస్ట్‌గా మంచి పేరుంది. ఈయన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో అలరించారు. ఆయన కూడా డాక్టర్ కావడం విశేషం.
9/ 16
ప్రణీత: తల్లిదండ్రులు డాక్టర్స్ కావడంతో ప్రణీత కూడా అదే వైపు మళ్లింది. ప్రస్తుతం డాక్టర్ ప్రాక్టీస్ ఒదిలిపెట్టి సినిమాలు చేస్తోంది. రీసెంట్గా ‘భుజ్’ సినిమాతో ‘హంగామా 2’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. (Twitter/Photo)
10/ 16
అజ్మల్ అమీర్: రంగం సినిమా విలన్ అజ్మల్ అమీర్ కూడా వైద్యుడే. నటనతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు ఈయన. రీసెంట్గా నయనతార హీరోయిన్గా నటించిన ‘నెట్రికన్’లో ఈయన డాక్టర్ పాత్రనే పోషించడం విశేషం. (Twitter/Photo)
11/ 16
భరత్: చిన్నపటి నుంచి సినిమాలు చేస్తున్న భరత్.. ఇప్పుడు పెద్దైన తర్వాత డాక్టర్ చదివాడు. మరో రెండేళ్లలో ఈయన కూడా వైద్యుడిగా మారిపోతాడు. (Twitter/Photo)
12/ 16
దివ్య నాయర్: ప్రముఖ మలయాళ నటి దివ్య నాయర్ కూడా ప్రఖ్యాత హోమియో డాక్టర్. ఈమె సినిమాల్లో నటిస్తూనే డాక్టర్‌గా వైద్య సేవలు అందిస్తోంది.
13/ 16
హరనాథ్ పొలిచెర్ల: తెలుగులో చంద్రహాస్ లాంటి సినిమాలు చేసిన హరనాథ్ పొలిచెర్ల కూడా వైద్యుడే. ఈయన ప్రస్తుతం సినిమాలకు పులిస్టాప్ పెట్టేసారు.
14/ 16
ఒకప్పటి విప్లవ కథానాయకుడు మాదాల రంగారావు కుమారుడు మాదాల రవి కూడా వృత్తి రీత్యా డాక్టర్. ఈయన ’నేను సైతం’ వంటి ఒకటి రెండు సినిమాల్లో నటించారు. ఇపుడు మంచు విష్ణు ‘మా’ ప్యానెల్ సభ్యుడిగా ఉన్నారు. (Twitter/Photo)
15/ 16
కావ్య: లిటిల్ సోల్జర్స్ సినిమాలో అల్లరి నటనతో ఆకట్టుకున్న కావ్య ఇప్పుడు వైద్యురాలు. అంతేకాదు ఇపుడు ఫేమస్ డాక్టర్‌గా సేవలు అందిస్తోంది.
16/ 16
సౌందర్య: లెజెండరీ నటి సౌందర్య కూడా డాక్టర్ కాబోయే యాక్టర్ అయింది. ఎంబిబిఎస్ మధ్యలో ఆపేసి నటిగా కొనసాగింది. ఒకవేళ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమే.