Nandamuri Taraka Ratna Health updates: నేడు (సోమవారం) మరోసారి తారకరత్న ఆరోగ్యంపై పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించబోతున్న డాక్టర్లు. ఫలితాల అనంతరం తదుపరి వివరాలు తెలపనున్నారు. ఈ రోజు హెల్త్ తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారట.
నందమూరి తారకరత్న ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్న ఆయన హెల్త్ క్రిటికల్ గా ఉందని తెలియడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
2/ 9
జనవరి 27 శుక్రవారం రోజు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. సడన్ గా కుప్పకూలడంతో అంతా షాకయ్యారు. వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి ఆ తర్వాత బెంగళూరు లోని నారాయణ హృదయాలకు తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.
3/ 9
నేడు (సోమవారం) మరోసారి తారకరత్న ఆరోగ్యంపై పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించబోతున్న డాక్టర్లు. ఫలితాల అనంతరం తదుపరి వివరాలు తెలపనున్నారు. ఈ రోజు హెల్త్ తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారట.
4/ 9
కొద్దిసేపటి క్రితం నిమ్హాన్స్ వైద్యులు నారాయణ హృదయాలయాకు చేరుకున్నారు. ఈ ప్రత్యేక వైద్య బృందం తారకరత్న బ్రెయిన్ డామేజ్ ఎంత వరకు అయింది? అనే దానిపై దృష్టి పెట్టి తదుపరి చికిత్స ఎలా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటున్నారట.
5/ 9
ఎక్మో పరికరంపైనే తారకరత్నకు చికిత్స అందుతోంది. ఆయన హెల్త్ ఇంకా క్రిటికల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంకా కొనసాగుతుండటంతో వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేడు వచ్చే ఫలితాల ఆధారంగా తారకరత్న ఆరోగ్యంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
6/ 9
తారకరత్నకు చికిత్స జరుగుతోన్న ఆస్పత్రిలోనే ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, తండ్రి మోహనకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
7/ 9
గతంలో తారకరత్నకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇది అనుకోకుండా జరిగింది. బ్యాడ్ లక్. హార్ట్ స్ట్రోక్ రావడంతో షాక్ కు గురయ్యాడు. ఆయన త్వరగా కోలుకోవాలని మనం ప్రార్ధిద్దాం అని తారకరత్న సోదరుడు చైతన్య కృష్ణ చెప్పారు.
8/ 9
తారకరత్న వైద్యంలో మిరాకిల్ జరిగిందని నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిన.. తర్వాత మళ్లీ గుండె కొట్టుకోవడం మిరాకల్ అని చెప్పారు. శరీరంలో మిగతా ఆర్గాన్స్ అన్ని బాగానే ఉన్నాయి అని బాలయ్య బాబు చెప్పారు.
9/ 9
ప్రస్తుతం తారకరత్నకు చికిత్స అందిస్తున్న బెంగళూరు నారాయణ హృదయాలయ వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంది. ఆయన హెల్త్ అప్ డేట్స్ తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. తారకరత్న తిరిగి ఆరోగ్యంగా బయటకు రావాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.