Santosham Child Artist: ఈ బుడ్డోడు అందరికీ గుర్తున్నాడు కదా.. అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni) హీరోగా నటించిన సంతోషం సినిమాలో కనిపించాడు ఈ కుర్రాడు. ఈ కుర్రాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. అసలెవరో తెలుసా..?
ఈ బుడ్డోడు అందరికీ గుర్తున్నాడు కదా.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాలో కనిపించాడు ఈ కుర్రాడు. దాంతో పాటు ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలోనూ బాలనటుడిగా కనిపించాడు.
2/ 7
ఆ తర్వాత ఉన్నట్లుండి మాయం అయిపోయాడు ఈ బుడ్డోడు. బూరెబుగ్గల ఈ చిన్నోడి పేరు అక్షయ్ బచ్చు.
3/ 7
సంతోషం సినిమాతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు అక్షయ్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు. 2002లో నాగార్జున సంతోషం సినిమాలో నటించినపుడు అక్షయ్ వయసు 6 ఏళ్లు మాత్రమే.
4/ 7
ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో బాగా నోటెడ్ అయిపోయాడు ఈ చిన్నోడు. ఓ హిందీ సినిమాలో అతడి నటన చూసి మురిసిపోయిన నాగార్జున సంతోషం సినిమాలో అవకాశం ఇచ్చాడు.
5/ 7
వర్షం సినిమాలో నటించిన తర్వాత తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్లోనే సెటిల్ అయ్యాడు ఈ బుడ్డోడు. అక్కడ ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ చేసాడు. హిందీలో దాదాపు డజన్ సినిమాలు చేసాడు అక్షయ్.
6/ 7
అంతేకాదు దాదాపు 45కు పైగా యాడ్ ఫిలిమ్స్‌లో నటించి బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఇప్పుడు నటుడిగా కాకుండా సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అక్షయ్ బచ్చు. హిందీ పాటలకు కవర్ వర్షన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అక్షయ్ బచ్చు.
7/ 7
మంచి మంచి పాటలు పాడుతూ తనలోని సింగింగ్ టాలెంట్ అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మంచి పాటలు పాడుతూ అదరగొడుతున్నాడు సంతోషం బుడ్డోడు.