ఫిక్షన్, థ్రిల్లర్ మూవీస్ ఆడియన్స్‌లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ముఖ్యంగా ఈ జోనర్లోని సైన్స్-ఫిక్షన్ (Sci-Fi) సినిమాలు, వెబ్ సిరీస్‌లు మనల్ని కంప్లీట్‌గా వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. అలాంటి అబ్బురపరిచే కొన్ని థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లు (Web Series) నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్నాయి. ఆసక్తిగా సాగే ఈ సిరీస్‌లకు ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. మరి ఆ సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
లాస్ట్ ఇన్ స్పేస్ (Lost In Space).. 2018లో మొదలైన అమెరికన్ సై-ఫై సిరీస్ లాస్ట్ ఇన్ స్పేస్ 3 సీజన్లను పూర్తి చేసుకుంది. 2021లో సీజన్ 3 విడుదల అయింది. ఈ సీజన్‌తో సిరీస్ పూర్తయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. మొదటి రెండు సీజన్లలో 10 ఎపిసోడ్లు ఉంటే లాస్ట్ సీజన్లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ సిరీస్ స్పేస్‌లో చిక్కుకుపోయిన ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఒక ఏలియన్ ప్లానెట్‌పై క్రాష్-ల్యాండింగ్ అయిన తర్వాత... రాబిన్సన్ కుటుంబం అక్కడ ఎదురయ్యే విచిత్ర పరిస్థితులతో పోరాడతారు. ఆ గ్రహాంతర ప్లానెట్‌పై దాగివున్న ప్రమాదాలను ఫేస్ చేస్తారు. ఇలాంటి స్టోరీలైన్‌తో వచ్చిన ఈ సై-ఫై సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది.
డార్క్ (Dark).. మోస్ట్ పాపులర్ టైమ్ ట్రావెల్ సిరీస్‌లలో డార్క్ కూడా ఒకటి. మూడు సీజన్లు గల డార్క్ అనేది జర్మన్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్. ఇది తప్పిపోయిన పిల్లవాడితో మొదలవుతుంది. ఆ పిల్లాడు ఎలా తప్పిపోయాడు? అని తెలుసుకునే క్రమంలో నాలుగు ఫ్యామిలీలు మూడు తరాలుగా విస్తరించి ఉన్న ఓ మైండ్-బెండింగ్ మిస్టరీని కనుగొంటారు. ఈ నేపథ్యంలో ఒక టైమ్ ట్రావెల్ కాన్స్పిరసీ బయటపడుతుంది. తర్వాత సస్పెన్స్ గా సాగే కథే ఈ సిరీస్!
ట్రావెలర్స్ (Travelers).. ట్రావెలర్స్ అనేది నెట్‌ఫ్లిక్స్‌లో మూడు సీజన్లను కలిగి ఉన్న ఓ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ సడన్‌గా కొత్త పర్సనాలిటీలు కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను ట్రాక్ చేసే ఒక ఫెడరల్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. ఇది మానవాళి భవిష్యత్తు గురించి ఆశ్చర్యకరమైన డిస్కవరీ దారితీస్తుంది. ఇందులో భవిష్యత్తు నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు ఫ్యూచర్లో చోటు చేసుకునే హ్యుమన్ ట్రాజిక్ ఫేట్‌ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇందుకు వారు ప్రజెంట్ జనరేషన్ పీపుల్స్ బాడీలోకి వెళ్లి ఓ మిషన్ చేపడతారు.
స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things).. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇప్పటి వరకు విడుదలైన స్ట్రేంజర్ థింగ్స్ మూడు సీజన్లు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇదొక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ సిరీస్. ఇందులో ఒక చిన్న పిల్లవాడు మిస్టీరియస్‌గా ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైపోతాడు. ఒక స్మాల్ టౌన్‌లోని ప్రజలు ఈ పిల్లాడిని కనిపెట్టే క్రమంలో గవర్నమెంట్ ల్యాబ్‌ల సీక్రెట్స్, మరొక ప్రపంచానికి పోర్టల్‌లు, ఈవిల్ మాన్స్టర్ల గురించి తెలుసుకుంటారు.