సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి పాత్రకైనా పాణం పెట్టి చేసే నటుడెవరంటే మనందరికి గుర్తుకు వచ్చే ముందు పేరు ప్రకాష్ రాజ్ (Prakash Raj) దే. మోనార్క్ వంటి తండ్రైనా...బొమ్మరిల్లు ఫాదరైనా...దూకుడు వంటి నానైనా...పోకిరిలో విలన్ క్యారెక్టరైనా ప్రకాష్ రాజ్ ముందు సలామ్ చేయాల్సిందే. (Photo Credit : Instagram)
తెలుగులో యస్వీరంగారావు, సత్యనారాయణ, రావుగోపాలరావు, కోట శ్రీనివాస్ రావుల తర్వాత అంతటి క్రేజ్ సంపాదించిన వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్. ఇటు వంటి ట్రాక్ రికార్డు వున్న ప్రకాష్ రాజ్ యాక్టింగ్ టాలెంట్ ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు... కోలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని వుడ్లు ఫిదా అయ్యాయి. ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులను గెలుచుకున్న ప్రకాశ్ రాజ్‌లో ఒక్క నటుడే కాదు..మంచి నిర్మాత, దర్శకుడు కూడా వున్నాడు. (Photo Credit : Instagram)
అయితే, లేటెస్ట్ గా ప్రకాశ్ రాజ్ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మూవీ అర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు నటుడు ప్రకాశ్ రాజ్. అయితే, లేటెస్ట్ గా మళ్లీ పెళ్లి చేసుకున్నారు ప్రకాశ్ రాజ్. ఆమె ఎవరాని తీరా చూస్తే తన రెండవ భార్య పోనీ వర్మ (Pony Verma)ను మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. లేటెస్ట్ గా 11వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. (Photo Credit : Instagram)
పోనీ వర్మ... హిందీ చిత్రపరిశ్రమకు బాగా సుపరిచితురాలు. తెలుగులో కూడా పని చేసినప్పటికి ఇక్కడి వారికి ఆమె పెద్దగా పరిచయం లేదు. పోనీ వర్మ అసలు పేరు రష్మీ వర్మ. పరిశ్రమలో ఆమె ఓ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. దాదాపు 21 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. (Photo Credit : Instagram)
దీంతో కుమారుడి ముందు పోనీ వర్మకు రింగ్ తొడిగి మళ్లీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ప్రకాశ్ రాజ్. ఇందుకు సంబంధించిన ఫొటోలనే ఆయన తన ట్విటర్లో షేర్ చేశాడు. కాగా ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ఈ సారి మా ఎన్నికల అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. (Photo Credit : Instagram)