శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ సాయి పల్లవి (Sai Pallavi). ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు చక్కటి అభినయాన్ని కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే పల్లవి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ..టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది. యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది.
ఈ భామ ప్రస్తుతం తెలుగులో "విరాట పర్వం" అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. నాని పీరియాడికల్ మూవీ శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా సాయి పల్లవినే హీరోయిన్. ఇందులో దేవదాసి పాత్రలో కన్పిస్తోంది.
ఇక, చాలా కాలం తర్వాత సినీ పరిశ్రమలో జోష్ పెంచింది లవ్ స్టోరీ సినిమా(Love Story Movie). థియేటర్లలో విడుదలై ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ సాధించింది. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో కూడా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది సాయి పల్లవి.