బాహుబలి లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశమంతా వేచి చూస్తుంది. కచ్చితంగా అన్నిచోట్లా ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు.
చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ కనిపించారు. అయితే ఈ ఇద్దరివీ సినిమాలో చాలా చిన్న పాత్రలు మాత్రమే. వీళ్లతో పాటు అజయ్ దేవగన్, శ్రీయ కీలక పాత్రల్లో నటించారు. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని మరో పాత్రలో నటించాడు. చరిత్రలో ఎక్కడా కలవని ఇద్దరు స్వాంతంత్య్ర సమరయోధుల కథను ఫిక్షనల్‌గా తెరకెక్కించాడు రాజమౌళి. ఈ సినిమాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..