రామ్ చరణ్ కెరీర్లో కొన్ని సినిమాలు మొదలు పెట్టి ఆపేసారు. అందులో కొరటాల శివ సినిమా కూడా ఉంది. దాంతో పాటు కెరీర్ మొదట్లోనే మరో సినిమాను కూడా మొదలు పెట్టి ఆపేసాడు చరణ్. అదే తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో ముహూర్తం జరుపుకున్న మెరుపు సినిమా. అప్పటికే తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా బంగారం సినిమా తెరకెక్కించాడు ధరణి. అది ఫ్లాప్ అయింది. అయినా కూడా ఆయన చెప్పిన కథ నచ్చి ఓకే అన్నారు.
మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆరెంజ్ లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ చేసాడు రామ్ చరణ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఆరెంజ్ డిజాస్టర్ అయింది. నాగబాబును నిర్మాతగా పూర్తిగా ముంచేసింది ఆరెంజ్. దీని అప్పుల నుంచి కోలుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచన చేసాడు నాగబాబు.
అట్టహాసంగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆర్థిక సమస్యలు రావడంతో ఆపేసారు. నిర్మాత బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పి సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేసారు. మెరపు సినిమా ఆగిపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే అని.. అప్పట్లో చరణ్‌పై ఈ బడ్జెట్ వర్కవుట్ కాదని ఆపేసారని వార్తలు వచ్చాయి.