యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఆయన లేటెస్ట్ సినిమా ఎన్టీఆర్ 30 ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభం అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవర అనే పేరును ఖరారు చేశారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Photo : Twitter
అది అలా ఉంటే ఎన్టీఆర్ ఓ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. విషయంలోకి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇండియా వైడ్‌గా ఎంతో పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక వార్ 2లో సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా టాక్ నడుస్తోంది. ఇక ఈ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోతున్నాడు. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ 30 విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెట్స్ వర్క్ పూర్తి అయ్యింది. దీంతో షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహిస్తోంది టీమ్. ఈ షూట్లో జాన్వీ కూడా పాల్గోంటుంది. ఇక తాజాగా ఎన్టీఆర్ 30 టీమ్‌తో హిందీ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ జాయిన్ అయ్యారు. ఆయన ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్‌కు జోడిగా తెలుగు సీరియల్ నటి అష్టా చమ్మా ఫేమ్ నటి చైత్ర రాయ్ నటించనుందని తెలుస్తోంది. Photo : Twitter
ఇక పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ హీరోయిన్గా చేస్తుండగా.. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని.. ఆ పాత్రలో హీరోయిన్ సాయి పల్లవి నటించే ఛాన్స్ ఉందని తాజాగా టాక్ నడుస్తోంది. గతంలో కూడా ఇలాంటీ రూమర్స్ రాగా.. ఈసారి మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇక కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. Photo : Twitter
ఇక ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడట కొరటాల శివ.. షూటింగ్ కాస్తా లేటైనా.. ఆరు నూరైనా.. ఎట్టి పరిస్థితుల్లో ముందుగా టీమ్ ప్రకటించిన డేట్‌కే ఈ సినిమాను విడుదల చేయడానికి సర్వ శక్తుల్నీ ఒడ్డుతున్నట్లు వినిపిస్తోంది. టీమ్ ఎన్టీఆర్ 30ని ఏప్రిల్ 5, 2024 న థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. Photo : Twitter
ఇక ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ.. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఐలాండ్ & పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూట్‌ను ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్, గోవాలో వేసిన సెట్స్‌లో జరుపునున్నారట. Photo : Twitter
అలాగే ఈ చిత్రానికి భారీగా వీఎఫ్ఎక్స్ ఉంటుందని అంటున్నారు. ఇలా భారీ హంగులతో రెడీ అవుతోంది ఎన్టీఆర్ 30. దీంతో ప్రస్తుతం టీమ్ షూటింగ్ కోసం సెట్స్‌ను వేస్తున్నారు. అత్యంత వైభవంగా సెట్స్‌ను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఓ షెడ్యూల్‌ను ఇక్కడే చిత్రీకరించనున్నారట.. ఈ సెట్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.. Photo : Twitter
ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ .ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. Photo : Twitter
ఇక ఆ మధ్య ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ ప్యాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. Photo : Twitter
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో భారీ మాస్ యాక్షన్ మూవీ చేయనున్నారు. అయితే ఒకటి కాదు.. రెండు ఎన్టీఆర్ 31, ఎన్టీఆర్ 32. వరుసగా రెండు సినిమాలను ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోందని తెలుస్తోంది.. Photo : Twitter
ప్రశాంత్ నీల్‌తో పాటు ఎన్టీఆర్ ఓ సినిమాను తమిళ దర్శకుడు వెట్రీ మారన్‌తో ఓ సినిమాను ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. వెట్రి మారన్ ప్రస్తుతం సూర్యతో వాడివాసల్ అనే మూవీ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు వెట్రీ, ఎన్టీఆర్ తో ఓ సినిమాను చేయనున్నారట. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగంలో ఎన్టీఆర్, రెండవ భాగంలో ధనుష్ హీరోలుగా నటిస్తారట.. Photo : Twitter
ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా 2022మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. Photo : Twitter
సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. మరోవైపు ఈ (RRR) చిత్రానికి చెందిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. అన్ని భాషాల్లో ఈ సినిమా మే 20, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter