తెలుగు బుల్లితెరపై తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న పేరు వంటలక్క.. హీరోయిన్లకు కూడా ఈ స్థాయిలో ఇమేజ్ ఉండదేమో అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఈ ఒక్క పేరు చాలు తెలుగు రాష్ట్రాలు రెండూ అభిమానంతో తడిసిపోవడానికి. ఓ సీరియల్కు ఇంత పాపులారిటీ వస్తుందా.. ఓ సీరియన్ నటిని ఇంతగా అభిమానిస్తారా అని అంతా ముక్కున వేలేసుకునేలా క్రేజ్ సంపాదించుకుంది ప్రేమీ విశ్వనాథ్.