కాజల్ కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఉంటాయని టాక్. అయితే ఈ రేంజ్లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని.. వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజల్ కూడా వంద కోట్ల ఆస్తులు కూడబెట్టి అందరికి షాక్ ఇచ్చారని అంటున్నారు. కాజల్ సినిమాలతో పాటు తన కెరీర్లో స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించి మెప్పించారు. ఆమె ప్రస్తుతం తన భర్త గౌతమ్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. Photo : Instagram
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఆ మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత అటు సంసార జీవితం సాగిస్తూనే మరో వైపు సినిమాల్లో నటించారు. ఇక ఇటీవలే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టుకున్నారు కాజల్. అది అలా ఉంటే కాన్పు తర్వాత కాజల్ మొదటి సారి తన తొలి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. Photo : Instagram
ఆ ఫోటోల్లో కాజల్ కేక పెట్టిస్తున్నారు. బిడ్డకు తల్లి అయినా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు ఆ ఫోటోను చూసిన నెటిజన్స్. ఇక మరోవైపు కాజల్ కొన్నాళ్ల పాటు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే వెచ్చించాలని కాజల్ భావిస్తున్నారట. Photo : Instagram
ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె ఈరోజు విడుదలైన ఆచార్యలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించారు. అయితే కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు దర్శక నిర్మాతలు. Photo : Instagram
అయితే ఈ విషయంలో కాజల్ కొంత బాధపడినప్పటికి ఆమెకు రావల్సిన రెమ్యూనేషన్ అప్పటికే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఆమె నటించాల్సిన అన్ని సన్నివేశాలు నటించారట. దీంతో తనకు రావాల్సిన రెమ్యునరేషన్‌ను పూర్తిగా తీసుకున్నారట కాజల్. ఈ సినిమాలో ఆమె నటించినందుకు కాజల్‌కు దాదాపు కోటిన్నర రూపాయలు రెమ్యూనరేషన్‌గా ఇచ్చారట. దీంతో తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ అందడంతో.. ఆచార్య సినిమా నుంచి పక్కన పెట్టినా ఆమె సైలెంట్ గా ఉందని అంటున్నారు. Photo : Twitter
ఇక కాజల్ పర్సనల్ విషయానికి వస్తే.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆ మధ్య తన చిన్ననాట మిత్రుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇక కాజల్ కుమారుడికి 'నీల్ కిచ్లూ' అనే పేరు పెడుతున్నట్టు తెలిపారు కాజల్ సోదరి నిషా అగర్వాల్ తెలిపిన సంగతి తెలిసిందే. కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని 2020 అక్టోబర్‌లో కాజల్ అగర్వాల్ పెళ్లాడారు. Photo : Twitter
అందాల చందమామ కాజల్ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. పెళ్లైన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతూనే ఉంది. ఎప్పటికపుడు తన ప్రెగ్నెసీ ఫోటోలను మరోసారి అభిమానులతో షేర్ చేసుకన్న విషయం తెలిసిందే కదా. ఈ రోజు ఉదయం కాజల్ అగర్వాల్ .. పండంటి మగబిడ్డకు ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సన్నిహితులు, అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Photo : Instagram
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది. రీసెంట్గా కాజల్ అగర్వాల్‌కు కుటుంబ సభ్యులు ఈమెకు ఘనంగా సీమంతం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. (Kajal Aggarwal Baby Shower కాజల్ అగర్వాల్‌కు సీమంతంకు ఇరు కుటుంబాలకు చెందిన కొంత మంది సభ్యుల సమక్షంలోనే జరగింది. సినీ పరిశ్రమ నుంచి ఒకరో ఇద్దరు హాజరయ్యారు. పెళ్లైన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతూనే ఉంది. ఇక కాజల్ బేబీ బంప్‌తో కొన్ని ఫోటోలను పంచుకుంది. గర్భవతి కావడంతో నాగార్జునతో చేయాల్సిన ‘ది ఘోస్ట్’ మూవీ నుంచి తప్పుకుంది. ఒక యేడాది తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అవుతానని చెబుతోంది. బిడ్డకు ఓ యేడాది వచ్చే వరకు చూసుకొని ఆ తర్వాత సినిమాలతో బిజీ కావాలనుకుంటోంది. Photo : Twitter
కాజల్ అగర్వాల్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతుందంటే.. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చందమామ రేంజ్ ఏంటో..? ఇప్పుడు కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది కాజల్. చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాల్లో ఈమె మెయిన్ హీరోయిన్. ఇక ఆచార్య విషయానికొస్తే.. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలైంది. అయితే ఆమె పాత్రను తొలగించిన సంగతి తెలిసిందే. Photo : Twitter
ఇక ఇటీవల కాజల్ తన భర్త గురించి ఓ ఏమోషనల్ పోస్ట్ చేశారు. అందులో తన భర్త గౌతమ్ కిచ్లూ ఎంత జాగ్రత్తగా తనను చూసుకుంటున్నారో తెలిపారు. తన భర్తకు ఎంతో అండర్ స్టాండింగ్ ఉంటుంది.. తనకు సపోర్ట్‌గా గత ఎనిమిది నెలలుగా ఉంటూ ఎంతో సౌకర్య వంతంగా చూసుకుంటున్నారంటూ ఓ పెద్ద పోస్ట్ చేశారు. అంతేకాదు తమ బేబీ రాకతో ఇక తమ జీవితాలు పూర్తిగా మారతాయని... మునపటిలా ఉండవని ఓ సుదీర్ఘ లేఖలో తెలిపారు. Photo : Instagram
మా జీవితాలు తీవ్రంగా మారబోతున్నాయి. ఇప్పుడు మనకు ఉన్నంత ఏకాంత సమయం ఉండదు. అంతేకాదు ప్రతి వారాంతంలో మునపటిలాగా సినిమాలకు వెళ్లలేము. మునపటిలా ఎప్పడంటే అప్పుడు పడుకుని నిద్రపోలేము. అదేపనిగా టీవీ షోలు చూడలేము.. గతంలో లాగా పార్టీలకు వెళ్లలేము. కానీ మన హృదయాలను చాలా ఆనందంతో నింపే ఓ అందమైన బేబీ మనతో ఉంటుంది.. మీరు చాలా అద్భుతమైన తండ్రి కాబోతున్నారు అంటూ రాసుకున్నారు కాజల్. Photo : Instagram
ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళైపోయినా కూడా ఇప్పటికీ కాజల్ రేంజ్ మాత్రం అలాగే ఉంది. సినిమాకు రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ అదరహో అనిపిస్తుంది కాజల్. కెరీర్ మంచి స్టేజీలో ఉన్నపుడే గతేడాది గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు. పెళ్లికి ముందే కండీషన్స్ అప్లై అనేసింది కాజల్ అగర్వాల్. కెరీర్‌కు అడ్డురాని పెళ్లి మాత్రమే చేసుకుంటానని చెప్పేసింది ఈమె. (Instagram/Photo)
ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. ప్రస్తుతం కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరుగా నిలిచింది. కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను దాటింది. దీంతో ఇదో రికార్డ్ అని అంటున్నారు. Photo : Instagram
గర్భం కారణంగా కాజల్ నాగార్జున ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకుంది. నిజానికి నాగార్జున ఘోస్ట్ సినిమా ఒప్పుకున్న తర్వాత.. కొన్ని రోజులు షూట్ చేసిన తర్వాత తాను గర్భవతి అనే విషయం తెలియడంతో ఈ సినిమా నుంచి కాజల్ తప్పుకుంది. ప్ణ్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండటంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది కాజల్. ఆమె ప్లేస్‌లో సోనాల్ చౌహాన్‌ను కథానాయికగా తీసుకున్నారు. (Instagram/Photo)
కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్య మహిళా ప్రధాన ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తున్నారు కాజల్. అందులో భాగంగా కాజల్ అగర్వాల్ 'ఉమ' అనే పూర్తిస్థాయి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. ఈ సినిమా తనకు జీవితకాలపు అందనుభవాన్ని మిగిల్చిందని, ఈ సినిమా ఇచ్చిన కిక్ నుంచి ఇంకా బయటపడలేక పోతున్నానని కాజల్ అగర్వాల్ పేర్కోన్నారు. Photo : Instagram
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... రాజకుటుంబానికి చెందిన పెళ్లి వేడుకలోకి ఓ అపరిచితురాలైన అమ్మాయి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఆ కుటుంబంలో..అమ్మాయి జీవితంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉమ వస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు తథాగత సింఘా. ఈ చిత్రంలో హర్ష్ ఛాయ, మేఘన మాలిక్, టిన్ను ఆనంద్, గౌరవ్ శర్మ, అయోషి తాలూక్దార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. Photo : Instagram