Samantha Akkineni : సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్లో ఒకరుగా వెలుగుతోంది.. Photo : InstagramSamantha Akkineni :
అది అలా ఉంటే సమంత ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వాణిజ్య ప్రకటనలలోను అదరగొడుతోంది. ఇక మరోవైపు సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా వివిధ రకాల బ్రాండ్స్‌ని ప్రచారం చేస్తుంటుంది. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వాణిజ్య పోస్టులు చేసినందుకు సమంత దాదాపు 20 నుండి 30 లక్షల వరకు వసూలు చేస్తోందని తెలుస్తోంది. ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 18 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. Photo : Instagram