ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు తమిళ భాషాల్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత దివ్యభారతి 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. ఓ దశలో దివ్యభారతి ఎంత బిజీగా ఉందంటే.. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. Photo : Twitter
సినిమాల్లో ఓ రేంజ్లో ఉండగానే దివ్యభారతి మే 10 న 1992 లో సాజిద్ నడియాడ్వాలాను పెళ్లి చేసుకుంది. ఇక ఓ సంవత్సరం తర్వాత ఏప్రిల్ 5, 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఇప్పటికీ ఆమె మృతికి గల సరైన కారణాలు లేవని.. ఆమె మృతి పట్లు చాలా అనుమానాలు ఉన్నాయని అంటుంటారు ఆమె అభిమానులు. Photo : Twitter