The Lion King : తెలుగులో ది లయన్ కింగ్.. ముఖ్య పాత్రలకు డబ్బింగ్ చెప్పింది వీరే..

The Lion King: ది లయన్ కింగ్.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం యానిమేషన్‌గా వచ్చిన డిస్నీ కామిక్..అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో క్రూర మృగాలు మనషుల్లా మాట్లాడతూ..మనలాగే ప్రవర్తిస్తాయి. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసి మెలిసి బతుకుతాయి. వీటికి ఓ రాజు, ఓ రాణి, ఓ యువరాజు ఉంటారు. అంతేకాదు జంతువు కనిపిస్తే చాలు వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. అయితే ఇదంతా డిస్నీ తయారు చేసిన ఓ కల్పిత కథ. దీని పేరే 'ది లయన్‌ కింగ్‌'. ఈ సినిమా ఇప్పుడు మరోసారి 3Dలో విడుదలౌతోంది. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషాల్లో జులై 19న విడుదల కానుంది. అందులో భాగంగా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.