Sukumar : Thabitha Sukumar : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకపరిచయం అక్కర లేదు. ఆయన కన్న ఆయన సినిమాలు ఎక్కువుగా మాట్లాడుతాయి. ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఆయన తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను పంచుకున్నారు. తన భార్య తబిత పుట్టినరోజు సందర్బంగా ఆయన ఓ ఫోటోను పంచుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Instagram
సుకుమార్ భార్య తబిత విషయానికి వస్తే.. ఆమె స్వతంత్రంగా బిజినెస్ చేస్తున్నారు. 'లాండ్రీ కార్ట్' పేరుతో ఆన్లైన్ లాండ్రీ బిజినెస్ చేస్తున్నారు. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్.. ఇన్ స్టాలో తబితకు 36 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. 'మీరు ఆత్మీయుల సన్నిధిలో ఉన్నపుడు ఏ వేడుక అయినా సరిగ్గానే జరుగుతుంది' అంటూ తన పిక్స్ కి క్యాప్షన్ పెట్టారు తబిత. ఇక తన భార్య కోసం తాజ్ ఫలక్‌నుమాలో సర్ పైజ్ పార్టీ ఇచ్చారు సుకుమార్. సుకుమార్, తబిత ప్రేమ వివాహం 2009లో జరిగింది. వీరికి సుకృతి, సుకృత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. Photo : Instagram
ఇక సుకుమార్ 'సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం పుష్ప అనే సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబినేషన్లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ మొన్నటి దాకా ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరుపుకుంది చిత్రబృందం. Photo : Instagram
ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. Photo : Instagram
ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. Photo : Instagram
ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించింది చిత్రబృందం. Photo : Instagram
ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా వచ్చే క్రిస్మస్కు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయనున్నారు. Photo : Instagram