Director Sons As Heroes | సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల వారసులు ఖచ్చితంగా హీరోలు అవుతుంటారు. ఏ ఒక్కరో ఇద్దరో నటన కాకుండా మరో ప్రొఫెషన్ ఎంచుకుంటారు కానీ దాదాపు 99 శాతం మంది మాత్రం నటన తప్ప మరో ఆప్షన్ తీసుకోరు. ఎందుకంటే బ్యాగ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఎంట్రీ పాస్ ఈజీగానే దొరుకుతుంది. సక్సెస్ అయితే ఖచ్చితంగా లైఫ్ బాగుంటుంది.. విజయం సాధిస్తే కోట్లలో రెమ్యునరేషన్.. రాజభోగం.. స్టార్ ఇమేజ్ అన్నీ వచ్చేస్తాయి. అదే సమయంలో బ్యాగ్రౌండ్ ఉండి కూడా సక్సెస్ కాలేకపోయిన వారసులు చాలా మంది ఉన్నారు. హీరోల వారసులు మాత్రమే కాదు.. కొందరు దర్శకులు కూడా తమ వారసులను హీరోలు చేసారు. చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో చాలా మంది హీరోలు దర్శకుల బ్యాగ్రౌండ్ నుంచే వచ్చారు. మరి వాళ్లెవరున్నారంటే..
11. శ్రీసింహా కోడూరి: ఇప్పటి వరకు రాజమౌళి కుటుంబం అంటే కేవలం టెక్నీషియన్స్ మాత్రమే గుర్తుకొచ్చేవాళ్లు. కానీ శ్రీసింహా కోడూరి వచ్చిన తర్వాత అక్కడ కూడా హీరోలు వచ్చారు. కీరవాణి కొడుకుగా వచ్చినా.. ఈయన కేరాఫ్ రాజమౌళిగానే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే మత్తు వదలరా, తెల్లవారితే గురువారం సినిమాలు చేసాడు సింహా. ఇప్పుడు భాగ్ సాలే అంటూ వస్తున్నాడు.