మహేశ్వరి తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి నట వారసురాలిగా అడుగుపెట్టింది. అక్కలా రాణించ లేకపోయినా.. తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక శ్రీదేవి మా అమ్మకు చెల్లెలు అవుతోంది. చిన్నమ్మ అవుతోంది. నేను చిన్నప్పటి నుంచి ఆమెను అక్కను పిలవడం అలవాటు అంటూ చెప్పుకొచ్చారు. ఆమె మన మధ్య లేకపోయినా.. ఎక్కడో విదేశాల్లో షాపింగ్లోనే.. ఏదైనా షోలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. ఆమె లేదన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. (Twitter/Photo)
మహేశ్వరి భారతీ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుత్తమ్మ’ తొలి సినిమా. శ్రీదేవి బంధువనే కారణంతోనే తనకు ఆ అవకాశం వచ్చిందన్నారు. అందులో ఓ పాట డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్యతో పాటు దివంగత టి.కృష్ణ పెద్ద కుమారుడు ప్రేమ్ (హీరో గోపీచంద్) అన్నకు నచ్చడంతో నాకు తెలుగులో ‘అమ్మాయి కాపురం’ సినిమాలో సెలెక్ట్ అయ్యాను. ఆ సమయంలో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య చాలా చిన్నగా కనిపిస్తున్నాను.. ఇలాంటి బరువైన పాత్రను చేస్తానా అనే డౌట్ పడ్డారు. కానీ వాళ్ల నమ్మకం వమ్ము కాలేదు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు నాకు నటిగా నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. (File/Photo)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ.. ఆయన దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా ‘దెయ్యం’ సినిమా షూటింగ్ మేడ్చల్లో ఉన్న వర్మ గెస్ట్ హౌస్లో షూటింగ్ చేస్తున్నాం. అక్కడ దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ చేశాం. మార్నింగ్ 6 టూ ఈవెనింగ్ 6 వరకు షూటింగ్ జరిగేది. ఇక ఆర్జీవి గెస్ట్ హౌస్ మాత్రం మెయిన్ రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ లొకేషన్ కాస్త భయంకరంగా ఉండేది. (File/Photo)
ఒక రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో షూటింగ్ జరగుతోంది. ఆ టైమ్లో రామ్ గోపాల్ వర్మ .. ఎవరైనా ఈ సమయంలో మెయిన్ రోడ్ వరకు వెళ్లి వస్తారా ఒక వేళ వెళ్లి వస్తే వాళ్లకు 50 వేలు ఇస్తానంటూ ఛాలెంజ్ చేసారు. ఎవరు ధైర్యం చేయలేదు. నేను మాత్రం ఎంతో ధైర్యంగా వెళ్లొచ్చాను. కానీ వర్మ మాత్రం ఆ డబ్బులు మాత్రం తనకు ఇవ్వలేదు. ఇప్పటికీ ఆయన కలుస్తుంటే ఆ డబ్బులు గురించి అడుగుతూ ఉంటానని చెప్పారు. ఈ విధంగా ఆర్జీవి తనను దారుణంగా మోసం చేేసిన విషయాన్ని నవ్వుతూ చెప్పారు మహేశ్వరి. (File/Photo)